మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉన్నది. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసాయి . ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే కీలక సమాచారం అందుతుంది. ఇక రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

Bholaa Shankar: Makers To Announce A Major Update On Chirajveevi's Next

సుశాంత్ ఇందులో కీర్తి సురేష్ కి బాయ్ ఫ్రెండ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే సుశాంత్ కూడా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మా నీళ్ల ట్యాంకు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి అలరించారు సుశాంత్. వాస్తవానికి హీరోగా కొన్ని సినిమాలలో నటించిన ఈయన అక్కడ కలిసి రాక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో కూడా భాగం పంచుకున్నారు సుశాంత్.

Tollywood actor Sushanth shares emotional message, rare pic on  grandparents' 71 wedding anniversary | Telugu Movie News - Times of India

ఒకవైపు చిరంజీవి మరొకవైపు మాస్ మహారాజా రవితేజ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ రెండు సినిమాలు గనుక భారీ హిట్ అయితే ఇప్పుడు ఈయనకు మరింత ఇమేజ్ లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వాస్తవానికి అలవైకుంఠపురం అనే సినిమా ద్వారానే ఆయన ఇలా సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి అయితే ఈ సైడ్ క్యారెక్టర్స్ ఈయనకు మంచి పాపులారిటీని అందిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మరి చూద్దాం సుశాంత్ కి.. ఈ రెండు సినిమాలు ఏ విధంగా కలిసి వస్తాయో.

Share post:

Latest