శ‌ర్వానంద్ కు ఈ రోజు నిజంగా స్పెష‌లే.. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు!

టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కు ఈరోజు నిజంగా స్పెషల్ డే అని చెప్పాలి. నేడు ఆయనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు శర్వా పుట్టినరోజు. ఇది అందరికీ తెలిసిందే. మార్చి 6న 1984లో జన్మించిన ఆయ‌న‌.. ఈ ఏడాదితో 39 ఏటా అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శర్వా తదుపరి చిత్రం `Sharwa35` నుంచి ఓ క్రేజీ పోస్టర్ విడుదలైంది.

అలాగే మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. నేటితో ఇండ‌స్ట్రీలో శ‌ర్వానంద్ ఇర‌వై ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్.. “20 ఏళ్లు ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్నీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మెరెన్నో. అచంచలమైన ప్రేమ మరియు మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. నా ఈ ‘ఓకే ఒక జీవితం’ సినిమాకి అంకితం.

20 సంవత్సరాల కింద ‘శ్రీకారం’ చుట్టిన ఈ సినీ ‘ప్రస్థానం’ మరుపురానిది, మరువలేనిది. ఈ సినీ లోకం లో నా ‘గమ్యం’ ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం ‘రన్ రాజా రన్’లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు నాకు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను’ అంటూ స్పెష‌ల్ నోట్ ను పంచుకున్నారు. ఇక మూడో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఇటీవ‌లే ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ కు నిశ్చితార్థం జ‌రిగింది. అంటే ర‌క్షిత రెడ్డి త‌న లైఫ్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత శ‌ర్వా జ‌రుపుకుంటున్న ఫ‌స్ట్ బ‌ర్త్‌డే ఇది.

Share post:

Latest