ఆ కారణంగానే ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా..!!

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమ లోకి నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సపోర్టు లేకుండా తనకు తానుగా ఎదిగాడు ఎన్టీఆర్. కేవలం తాను ఒక నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనకు దగ్గర అయింది. అయితే ఆ మధ్యకాలంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను సైడ్ చేస్తున్నారని నందమూరి అభిమానులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది.

Jr NTR Wishing Balakrishna: Big Disappointment!
భారతదేశం గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందంటే RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడమే అని చెప్పవచ్చు. అయితే దీనిపైన బాలయ్య కేవలం RRR చిత్ర బృందానికి మాత్రమే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఎన్టీఆర్ పేరును కూడా అసలు ఎక్కడ ప్రస్తావించలేదు. మరొకవైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్ RRR ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ పేరును మాత్రమే ట్యాగ్ చేశారు తప్ప ఎన్టీఆర్ పేరుని ఎక్కడ ట్యాగ్ చేయలేదు. దీంతో బాలయ్య సొంత బాబాయి అయినప్పటికీ కూడా తారకు ఏ విధంగా సపోర్టు ఇవ్వకపోవడంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

మరి కొంతమంది మాత్రం తారక్ ఎదగడం బాలయ్యకి అసలు ఇష్టం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఎదగడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారని అందుచేతనే బాలయ్య ఎన్టీఆర్ను సైడ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ మాత్రం ఒక్కటయి ఎక్కడికి వెళ్లినా తామిద్దరం అన్నదమ్ములమంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో త్వరలోనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

Share post:

Latest