కడప టీడీపీలో పోటీ..ఆ సీట్ల కోసం పట్టు!

వైసీపీ కంచుకోట…జగన్ సొంత గడ్డ కడపపై టీడీపీ ఈ సారి గట్టిగానే ఫోకస్ చేసింది. గత కొన్ని ఎన్నికల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు, 2014లో ఒక్క సీటు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది.

వరుసగా ఓడిపోవడంతో టీడీపీపై సానుభూతి ఉంది. దీంతో ఈ సారి కడపలో టి‌డి‌పి కనీసం..రెండు, మూడు సీట్లు అయిన గెలవాలని చూస్తుంది. జిల్లాలో టీడీపీకి కాస్త పట్టు కూడా పెరుగుతుంది. మైదుకూరు, ప్రొద్దుటూరు లాంటి సీట్లలో టీడీపీకి బలం పెరిగింది. అలాగే ఆయ సీట్లని దక్కించుకునేందుకు పోటీ పెరిగింది. ఈ రెండు సీట్లలో టీడీపీలో పోటీ ఉంది. ఇక రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు సీట్లలో కూడా పోటీ నెలకొంది.

రాయచోటిలో ముగ్గురు నాయకులు టికెట్టును ఆశిస్తున్నారు..పైగా ముగ్గురి కుటుంబాలు రాజకీయ నేపథ్యం కలిగి ఉండడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అటు రాజంపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇద్దరు నాయకులు టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం రైల్వేకోడూరులో ప్రస్తుతం టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్న నరసింహ ప్రసాద్ తో పాటు మరో కొత్త నేత కూడా సీటు ఆశిస్తున్నారని తెలిసింది.

అటు కమలాపురం సీటులో కూడా పోటీ ఉంది. ఇలా ఆరు సీట్లలో టి‌డి‌పిలో పోటీ ఉంది. మరి చివరికి ఆ సీట్లు ఎవరికి దక్కుతాయో చూడాలి.