అరకు-పాడేరులో టీడీపీకి గెలుపు కలే!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాలు అరకు-పాడేరు..స్వచ్చమైన గిరిజన ప్రాంతాలు..మంచి టూరిస్ట్ ప్లేస్‌లు అయితే ఇక్కడ సదుపాయాలు చాలా తక్కువ. రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, తాగునీటి వసతులు తక్కువ. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆ నియోజకవర్గాల్లో పరిస్తితి అదే. అయితే ఇప్పటివరకు ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ హవానే నదిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నదిచింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆ స్థానాల్లో పెద్దగా మార్పు లేదు. అభివృద్ధి తక్కువ..ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ. అయినా సరే అక్కడి ప్రజలు వైసీపీనే ఎక్కువ అభిమానిస్తారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే..జగన్ పై అభిమానం ఎక్కువ. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అక్కడి ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో వైసీపీ బలం తగ్గలేదు. అదే సమయంలో టి‌డి‌పి బలం పెరగడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్తితిలో టి‌డి‌పి ఉంది.

అందుకే లేటెస్ట్ సర్వేల్లో కూడా అరకు-పాడేరు స్థానాల్లో టి‌డి‌పి గెలవదని తేలింది. అరకులో 2009లో మాత్రమే టి‌డి‌పి గెలిచింది…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..ఈ సారి ఎన్నికల్లో కూడా గెలవడం కష్టమని తెలుస్తోంది. అటు పాడేరులో టి‌డి‌పి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లో..అంతకముందు 1994లో గెలిచింది. 1985లో కూడా ఒకసారి గెలిచింది. అంటే మూడుసార్లు మాత్రమే పాడేరులో టి‌డి‌పి గెలిచింది.

2004, 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు పాజిటివ్ లేదు..అలా అని టి‌డి‌పికి ప్లస్ లేదు. కాబట్టి రెండు చోట్ల టి‌డి‌పి మళ్ళీ ఓడిపోయేలా ఉంది.

Share post:

Latest