జనసేన దెబ్బకు టీడీపీకి డ్యామేజ్..ఆ జిల్లాల్లోనే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేయకపోతే అటు టి‌డి‌పి నష్టపోతుంది..ఇటు జనసేన కూడా నష్టపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సర్వేలో అదే తేలిందని చెప్పవచ్చు. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే పుత్రి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే జనసేన సపోర్ట్ కావాల్సిందే. అటు జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న టి‌డి‌పి మద్ధతు ఉండాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్.

ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే తేలింది. సర్వే ప్రకారం 78 స్థానాల్లో టి‌డి‌పి, 63 స్థానాల్లో వైసీపీ, 7 స్థానాల్లో జనసేన గెలుస్తుందని తేలింది. 27 స్థానాల్లో హోరాహోరీ ఉంటుందని చెప్పింది. అయితే ఐదు జిల్లాల్లో జనసేన ఓట్ల చీలిక ప్రభావం ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకుంటే..ఇక్కడ టి‌డి‌పి 8, వైసీపీ 6, టఫ్ ఫైట్ మూడు స్థానాల్లో ఉందని తేలింది.

అయితే వైసీపీ గెలిచే సీట్లు ఒక్కసారి చూస్తే గుంటూరు ఈస్ట్, తెనాలి, పెదకూరపాడు, పత్తిపాడు, మాచర్ల, నరసారావుపేట..వీటిల్లో మాచర్ల, నరసారావుపేట పక్కన పెడితే..మిగిలిన స్థానాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది..వాటిల్లో ఓట్లు చీలిక వల్లే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చూసుకుంటే వైసీపీ 6, టి‌డి‌పి6, జనసేన 4 సీట్లు గెలుచుకుందని, 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ వైసీపీ గెలిచే సీట్లు వచ్చి.. రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరం సీట్లు ఉన్నాయి. వీటిల్లో కాకినాడ అర్బన్, రాజానగరం, రామచంద్రాపురంలో జనసేన ప్రభావం ఉంది..అంటే ఆ స్థానాల్లో ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం..వైసీపీకి లాభం. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.