నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయింది.. బిగ్ బాంబ్ పేల్చిన‌ త‌మ‌న్నా!

నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయిందంటూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తాజాగా బిగ్ బాంబ్ పేల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త‌ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీని వీరిద్దరూ జంటగా గోవాలో చేసుకున్నారు.

ఆ పార్టీ నుంచి వీరిద్దరి లిప్ లాక్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు వీరిద్దరూ జంటగా దర్శనమివ్వడంతో తమన్నా విజయ్ వర్మ ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా తమన్నా ఈ వార్తల‌ను ఖండించింది. ఒక సినిమాలో నటించినంత మాత్రానికే తామిద్దరం ప్రేమలో ఉన్నట్టు కథలు అల్లేశారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అయినా ఇలాంటి అనవసర విషయాల గురించి తాను పట్టించుకోనని తమన్నా పేర్కొంది.

ఇక హీరోయిన్ల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేద‌ని, తమకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటార‌ని త‌మ‌న్నా చిరు కోపం ప్ర‌ద‌ర్శించింది. త‌న‌కు కూడా అలా సార్లు పెళ్లి అయింద‌ని, డాక్ట‌ర్ల నుంచి బిజినెస్‌మెన్ ల వ‌ర‌కు అంద‌రితోనూ త‌మ‌ వివాహం జరిపిస్తుంటారు.. అవన్నీ చదువుతుంటే ఒక్కోసారి త‌న‌కు కూడా త‌న‌ పెళ్లి అయిపోయింద‌న్న‌ అనుమానం కలుగుతుంది అంటూ త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

Share post:

Latest