క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `SSMB 28` ఓవర్సీస్ రైట్స్‌.. మ‌హేష్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌!?

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసింది. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీని ఇటీవలే సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోయే ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ క‌ళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాయని తాజాగా ఓ టాక్‌ బయటకు వచ్చింది.

ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ భారీగా ఉంది. అయితే ఫైన‌ల్ గా ఓవర్సీస్ హక్కులను రూ. 24 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో యుఎస్ఏ హక్కులు రూ. 16 కోట్లని తెలుస్తోంది. ఏదేమైనా ఓవ‌ర్సీస్ లో మ‌హేష్ కెరీర్ లోనే హైమ్మెస్ట్ బిజినెజ్ ఇద‌ని అంటున్నారు. ఇక‌పోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులని రూ.81 కోట్లకి ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు.

Share post:

Latest