బాల‌య్య సినిమాకు 20 రోజులు ఇచ్చిన శ్రీ‌లీల‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈమె సైన్ చేసిన ప్రాజెక్టులలో `ఎన్‌బీకే 108` ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేకంగా షూటింగ్ జరుపుకుంటుంది. తండ్రి కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుంది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల‌ కనిపించబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల‌ పాత్రకు రన్ టైం దాదాపు 40 నిమిషాల వరకు ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సినిమాకు 20 రోజులు డేట్స్ ఇచ్చిందట.

అయితే ఈ సినిమాకు శ్రీలీల‌ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. కేవలం 20 రోజులకే కోటిన్న‌ర రూపాయిలు తీసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నటిస్తోంది. మామూలుగా తాను హీరోయిన్ గా నటించే ప్రతి సినిమాకు ఇదే స్థాయిలో శ్రీ‌లీల రెమ్యున‌రేషన్ తీసుకుంటుంది. కానీ బాలయ్య సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాదు. కూతురు పాత్రను పోషిస్తుంది. అయినా సరే ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం మామూలు విషయం కాదని చెప్పాలి.

Share post:

Latest