న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌.. మ‌రో గోల్డెన్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!?

శ్రీలీల.. ఈ కన్నడ సోయగం తెలుగులో ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే యంగ్ సెన్సేషన్ గా మారింది. శ్రీలీల దెబ్బకు అటు యంగ్ హీరోయిన్లు, అటు స్టార్ హీరోయిన్లు హడలెత్తిపోతున్నారు. రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అలాగే ఓవైపు యంగ్‌ హీరోలు మరోవైపు స్టార్ హీరోలతో కూడా జత క‌డుతూ క్షణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

ప్రస్తుతం శ్రీలీల‌ చేతిలో అర డజన్ కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక నక్క తోక తొక్కిందేమో కానీ తాజాగా మరో గోల్డెన్ ఆఫర్ అందుకుందీ బ్యూటీ. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు.

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రంలో తాజాగా శ్రీ‌లీలను హీరోయిన్ గా తీసుకున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

 

Share post:

Latest