ఆమె ఎవ‌రో కూడా తెలియ‌దు.. ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడుగా!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ విడుద‌ల త‌ర్వాత ర‌ష్మిక సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో బిజీగా మారిపోయింది. ఈ అమ్మ‌డికి ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది.

అలాంటి ర‌ష్మిక ప‌రువు దారుణంగా తీసేశాడో యంగ్ క్రికెట‌ర్‌. ఇంత‌కీ ఆ క్రికెట‌ర్ మ‌రెవ‌రో కాదు.. శుబ్‌మన్ గిల్. తాజాగా ఈ యంగ్ క్రికెటర్ `రష్మిక నా ఫస్ట్ క్రష్` అని చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్త‌ల‌పై శుబ్‌మన్ గిల్ స్పందించాడు. `నేను ఏ మీడియాతోనూ ఆ మాట చెప్ప‌లేదు.. అస‌లు ర‌ష్మిక‌ ఎవరో కూడా నాకు తెలీదు..’ అంటూ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు.

దీంతో `ర‌ష్మిక తెలియ‌దా నీకు` అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుంటే.. మ‌రికొంద‌రు ఆ ఒక్క మాట‌తో ర‌ష్మిక ప‌రువు మొత్తం పోయిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శుబ్‌మన్ గిల్ విష‌యానికి వ‌స్తే.. సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో కొన్నాళ్లు ప్రేమాయ‌ణం న‌డిపించాడిత‌డు. సారాతో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం సారా ఆలీ ఖాన్‌తో శుబ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమల్లో ఉన్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

 

Share post:

Latest