ఆ విషయంలో కాళ్లా, వేళ్లా పడతానంటున్న శ్రుతి హాసన్.. పరిస్థితి ఘోరం??

హీరోయిన్లు పెళ్లి, పిల్లల విషయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. కానీ మరికొంతమంది రిలేషన్‌లో ఉండి కూడా పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇక కొందరు పెళ్లి చేసుకుంటే తమ సినీ కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అని అసలు పెళ్లి చేసుకోడమే మానేస్తారు. అలా పెళ్లి చేసుకోకుండా ఉన్న నటీనటులకు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.

తాజాగా కమల్‌ హాసన్ కూతురు శ్రుతిహాసన్‌కి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ తార తెలుగు, హిందీలతో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ కూడా చేస్తుంది. చాలా వరకు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇక శ్రుతి హాసన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శాంతాను హజారికా తో సహజీవనం చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో ఎక్కువగా షేర్ చేస్తుంది. నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం చూసి అందరూ శ్రుతి హాసన్‌ ను విమర్శించారు.


అయితే శృతికి చాలాసార్లు తన పెళ్లి గురించి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇప్పటికీ కూడా ఆమె బయట కనిపిస్తే చాలు పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. తాజాగా శృతి సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో కాసేపు చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఒకరు మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగితే ‘ఈ ప్రశ్న నాకు చాలా బోరింగ్, దీని గురించి అస్సలు అడగవద్దు’ అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి ఎవరూ అడగద్దని కాళ్లా, వేళ్లా పడుతున్న రీతిలో శ్రుతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Share post:

Latest