పెళ్లెప్పుడంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. ఊహించ‌ని రిప్లై ఇచ్చిన శృతిహాస‌న్!

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీర‌య్య‌, వీర సింహా రెడ్డి చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది.

ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్, హాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గత రెండేళ్ల నుంచి ఈ బ్యూటీ చిత్ర‌కారుడు శంత‌ను హ‌జారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్‌ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఓ నెటిజ‌న్ పెళ్లెప్పుడు..? అంటూ ప్రశ్నించగా.. శృతిహాసన్ ఊహించిన రిప్లై ఇచ్చింది. ఇప్పటికే ఈ ప్రశ్న చాలా సార్లు వినీ వినీ బోర్ కొట్టేసింది అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి కాకుండా ఇంకేదైనా అడగండి అంటూ శృతి పేర్కొంది. మొత్తానికి ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా శృతి చెప్పకనే చెప్పేసింది.

Share post:

Latest