కూతురు కోసం సీనియర్ హీరోయిన్ కష్టాలు… ఫలించేనా?

నిన్నటి హీరోయిన్ లయ మీరు గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే అందం కాదు ఆమెది. మొదటి సినిమా అయినటువంటి “స్వయంవరం”తోనే తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మహిళలను మెప్పించిన తెలుగమ్మాయి లయ. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకుంది. హోమ్లీ పాత్రలను పోషించడంలో లయ తరువాతే ఎవరైనా. హీరోయిన్ సౌందర్య తరువాత లయ ఆ పేరు తెచ్చుకుంది అని చెప్పుకోవాలి. అందుకే ఈమెకు ఫామిలీ ఆడియన్స్ లో మంచి పేరు వుంది.

కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే లయ పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. తరువాత ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో కనిపించలేదు. ఈమధ్యకాలంలో ఆమె సోషల్ మీడియా ద్వారా ఫొటోలు వీడియో లను షేర్ చేయడం ద్వారా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. అదేవిధంగా ఈమధ్య కొన్ని మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూ కూడా ఇస్తూ వస్తోంది. సదరు మీడియాలో లయను చూసిన నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. అప్పట్లో సినిమాల్లో నటించే సమయంలో ఆమె ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేమంటే లయ తన కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయడానికే నానా కష్టాలు పడుతోంది అంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయం పైన ఆమె మాత్రం ఎటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వకపోవడం కొసమెరుపు. టాలీవుడ్లో కొందరు మాత్రం హీరోయిన్ గా లయ కూతురు ఎంట్రీ తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని, అదేగాని నిజమైతే మరో హీరోయిన్ తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు!

Share post:

Latest