Sameer: బాలకృష్ణ కూడా అలా చేస్తారని ఊహించలేదు.. సమీర్..!

Sameer.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు సమీర్. సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని అటు వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యాడు. ఇదిలా ఉండగా ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సుమ అడ్డా ఈవారం కూడా మరింత వినోదం పంచడానికి సిద్ధమయింది.. మార్చి 4వ తేదీన ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో నటీనటులు సమీర్ , హేమ, గిరిధర్ సందడి చేశారు. వీరంతా అన్నయ్య సినిమా స్పూఫ్ చేసి నవ్వించారు.. ఆ తర్వాత సుమా తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు పంచుకున్న సమీర్ బాలయ్య చేసిన పనికి ఊహించలేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

Actor Sameer About Nandamuri Balakrishna Behaviour At Event | డోర్ తీసి  తోసేశారట!.. బాలయ్య చేసిన పనిపై నటుడు సమీర్ కామెంట్స్News in Telugu

ఇకపోతే సుమ అడ్డా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షేర్ చేయగా.. ఇప్పుడు అది బాగా వైరల్ గా మారుతుంది. షోలోకి రాగానే సమీర్ ని ఉద్దేశించి గ్లామర్ గా ఉండడానికి ఏం చేస్తారని సుమ అడగగా ..సుమా షోలు చూస్తూ ఉంటామని ఆయన సెటైరికల్ పంచ్ వేశారు. దీంతో అక్కడ స్టూడెంట్స్ చప్పట్లతో హోరెత్తించారు. ఆ తర్వాత పెళ్లిచూపులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్టూడెంట్స్ తో తెగ సందడి చేశారు టీం. స్కిట్ పూర్తయిన తర్వాత సుమా .. సమీర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఫాన్స్ తో ప్రమోషన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా? అని సుమ ప్రశ్నించారు.

సమీర్ మాట్లాడుతూ..” అంత దూరంలో ఒక గేటు ఉంది.. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలి. అయితే ఆ ప్రాంగణం అంతా అభిమానుల కోలహాల మధ్య బస్సు మధ్యలో వెళ్లలేకపోయింది. అయితే నేను ఊరుకోకుండా బస్సులో నుంచి బాబు ఎలా వెళ్తారు ఈ జనాల్లో నుంచి అన్నాను.. వెంటనే బాలయ్య బాబు చూస్తావా అంటూ.. డోర్ తీసి వెనకనుంచి నన్ను జనాల్లోకి ఒక తోపు తోసేశారు. ఆ క్షణం బాలయ్య బాబు అలా చేస్తారని అసలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేశారు సమీర్. ఇకపోతే ప్రస్తుతం సమీర్ చేసిన కామెంట్లు అలాగే సుమ అడ్డ ప్రోమో రెండూ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest