ఒక్క పోస్టుతో అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చిన సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా పేరుపొందింది సమంత. ప్రస్తుతం ఎక్కువగా తన దృష్టి అంత సినిమాల పైన పెట్టింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఈమె ఇప్పుడు సీటడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి చిత్రంలో కూడా షూటింగ్ కి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమాంత సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది.

Samantha Ruth Prabhu Treatment: Samantha Ruth Prabhu looks to Ayurveda to  cure autoimmune condition myositis - The Economic Times

అటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పలు రకాల కొటేషన్స్ ను సైతం షేర్ చేస్తూ ఉంటుంది .ఈమె షేర్ చేసిన ప్రతి పోస్ట్ కూడా క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది. తాజాగా నమ్మకం గురించి సమంత పలు ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేసింది. కొన్నిసార్లు అది మానవాతిత బలాన్ని ఏమాత్రం తీసుకోదు.. కేవలం నమ్మకమే మిమ్మల్ని పొందుతుంది..విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.. నమ్మకమే మీ గురువు మీ స్నేహితుడిగా ఉంటుంది.. మిమ్మల్ని నమ్మకమే మానవాతికంగా చేస్తుంది అంటూ లింగ బైరవి అమ్మవారి ముందు సమంత ధ్యానం చేస్తున్నటువంటి ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.

సమంత షేర్ చేసిన ఈ ఫోటోకు మీరు చాలా స్ట్రాంగ్ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. సమంత ఎక్కువగా ఈశా ఫౌండేషన్కు వెళుతూ ఉంటుంది అంతేకాకుండా నిత్యం సద్గురు చెప్పిన పలు సూచనలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉండే లింక్ బైరవి అమ్మవారి విగ్రహాన్ని సమంత ఇంట్లోనే పూజించుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Share post:

Latest