RRR: ఎన్టీఆర్ పాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి..!!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉందని రామ్ చరణ్ ని హైలైట్ గా చేశారని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి

జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందా.. వేణుస్వామి చెప్పిన  వాస్తవాలివే | interesting facts about junior ntr astrology details, junior  ntr, venu swamy, junior ntr cm, cm jagan ...
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య వ్యత్యాసం గురించి మరొకసారి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించారని రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేశారంటూ పలువురు ఈ విషయం గురించి ప్రతిసారి చర్చిస్తూనే ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రామ్ చరణ్ ను కూడా అక్కడ హోస్టుగా వ్యవహరిస్తున్న ఒకరు ఎన్టీఆర్ పాత్రను సైడ్ క్యారెక్టర్ అంటూ మాట్లాడడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఒక న్యూస్ డిబేట్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ పాత్రను పదేపదే సైడ్ క్యారెక్టర్ అంటూ నొక్కి చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి RRR సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో రాంచరణ్ పాత్రను హైలైట్ చేశారని ఎన్టీఆర్ పాత్ర కనుక చూస్తే ఈ చిత్రంలో తనది సైడ్ క్యారెక్టర్ లాగే ఉంది అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest