అందంగా క‌నిపించేందుకు ర‌ష్మిక ఎలాంటి ప‌నులు చేస్తుందో తెలుసా?

హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం.

ఇక మ‌న ర‌ష్మిక మంద‌న్నా అందంగా క‌నిపించేందుకు ఎలాంటి ప‌నులు చేస్తుందో తాజాగా వివ‌రించింది. ఇటీవ‌ల‌ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. త‌న అందాన్ని ర‌క్షించుకునేందుకు ఎక్కువగా పోషకాలు కల్గిన ఆకుకూరలు తీసుకుంటుందట. అలాగే నిద్రపోయే ముందు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటానని ర‌ష్మిక‌ తెలిపింది. బాడీని ఎప్పుడూ హైడ్రేట్‍గా ఉంచుకుంటుంద‌ట‌.

ఇక అమ్మ, అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఫుడ్స్ తీసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని.. హెల్తీ హెయిర్ కోసం వెచ్చని నూనెతో మసాజ్ చేయించుకుంటాన‌ని ర‌ష్మిక చెప్పుకొచ్చింది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈ బ్యూటీ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ స‌ర‌స‌న `యానిమ‌ల్‌` అనే సినిమాకు క‌మిట్ అయింది. ఇవి రెండు పాన్ ఇండియా చిత్రాలే కావ‌డం విశేషం.

Share post:

Latest