ఈ ఒక్క ట్విట్టితో ..మళ్లీ వైరల్ గా మారుతున్న రష్మిక..!!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో అప్పుడప్పుడు క్లోజ్ గా ఉంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ రష్మిక. విజయ్, రష్మి క కలిసి పలుసార్లు వెకేషన్ కి వెళ్ళారంటూ అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు రావడంతో పాటు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ బాగా వినిపిస్తూ ఉంటోంది. కానీ వీటిపై ఎప్పుడు కూడా ఈ జంట క్లారిటీ ఇవ్వడం లేదు కేవలం సామిద్దరం స్నేహితులం అంటూ పలు రూమర్ల పైన స్పందిస్తూ ఉంటారు.

రష్మిక, విజయ్ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆనంద్ దేవరకొండ తో కూడా క్లోజ్ గానే ఉంటుందట ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ అమ్మతో అప్పుడప్పుడు కనిపిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా తన ఫ్యామిలీతోనే చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రష్మిక విషెస్ తెలపడం జరిగింది. హ్యాపీ బర్తడే ఆనంద్ దేవరకొండ అంటూ ఫన్నీ ఎమోజిని షేర్ చేయడం జరిగింది ఇందుకు ఆనంద్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ రష్ అని తెలిపారు. అందుకు సంబంధించి ఒక పోస్ట్ వైరల్ గా మారుతుంది.

ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం బేబీ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు బేబీ సినిమాతో మరొకసారి ప్యూర్ లవ్ స్టోరీ తో అందరిని మెప్పించబోతున్నట్లు కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ హైవే పుష్పక విమానం వంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి కేవలం మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా మాత్రమే సరైన హిట్టుగా నిలిచింది. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ పెద్దగా క్లిక్ కాలేకపోయారు. ఈ ట్విట్ తో మళ్ళీ రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest