ఆస్కార్ ఈవెంట్ లో చ‌ర‌ణ్ ధ‌రించిన వాచ్ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తాజాగా భార‌తీయులంద‌రూ గ‌ర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవ‌శం చేసుకుని చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుక‌లో `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ఇక‌పోతే ఆస్కార్ ఈవెంట్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీస‌మేతంగా హాజ‌రు అయ్యాడు. త‌న డ్ర‌స్సింగ్ స్టైల్ తో అంద‌రినీ ఎట్రాక్ట్ చేశారు. అయితే ఆస్కార్ ఈవెంట్ లో చ‌ర‌ణ్ ధ‌రించిన వాచ్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రామ్ చ‌ర‌ణ్ పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ (5980/1R) వాచ్ ను ధ‌రించాడు. ఈ వాచ్ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే, ఈ స్టైలిష్ వాచ్ ఖ‌రీదు ఏకంగా 108,820 డాలర్స్. అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో 89, 57,963 రూపాయిలు అన్న మాట‌. ఏదేమైనా చ‌ర‌ణ్ ఒక వాచ్ కే అన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాడంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పవ‌చ్చు.

Share post:

Latest