అమెరికాలో చ‌ర‌ణ్ ధరించిన ఆ సూట్‌ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వ‌డంతో.. చిత్ర టీమ్ తో క‌లిసి చ‌ర‌ణ్ అక్క‌డ వ‌ర‌స‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. మార్చి 13న ఆస్కార్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక‌పోతే ఇటీవ‌ల ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ హెచ్ఎసీ(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి రామ్‌ చరణ్ ప్రజెంటర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకున్నారు. అలాగే మ‌రోవైపు అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన షో.. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో కూడా రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేశాడు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ధ‌రించిన సూట్స్ అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

 

స్టైలిష్ సూట్స్ లో చ‌ర‌ణ్ సూపర్ స్టైలిష్ గా కనిపించారు. రాంచరణ్ లుక్ హాలీవుడ్ వారిని కూడా ఆకర్షించింది. అయితే చ‌ర‌ణ్ ధరించిన ఆ సూట్స్ ధ‌ర తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే, అంతర్జాతీయ వేదికలపై అంద‌రినీ ఎట్రాక్ట్ చేసేందుకు చెన్నైలోని ప్రముఖ డిజైనర్ దగ్గర చ‌ర‌ణ్ ఈ షూట్స్ ప్రత్యేకంగా తయారు చేయించారట. ఒక్కో సూట్ ధ‌ర రూ. 13 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విష‌యం తెలిసి అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు షాకైపోతున్నారు.

Share post:

Latest