కడుపులో ఉండగానే అదృష్టం.. పుట్ట‌బోయే బిడ్డ‌పై చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌!

ప్రపంచ సినీప‌రిశ్ర‌మ‌లోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో ఆదివారం జ‌రిగిన‌ 95వ ఆస్కార్ అవార్డు వేడుకలో `ఆర్ఆర్ఆర్‌`లోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ మొత్తం సంబ‌రాల్లో మునిగిపోయారు. మ‌రోవైపు భార‌తీయ సినీ ప్రియులంద‌రూ `ఆర్ఆర్ఆర్‌`కు ఆస్కార్ రావ‌డం ప‌ట్ల క‌ల‌ర్ ఎగ‌రేస్తున్నారు. అయితే ఆస్కార్ అవార్డును అందుకున్న అనంత‌రం రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు మీడియాతో ముచ్చ‌టించారు.

 

ఆర్ఆర్ఆర్ ఫ్యామిలిలో భాగంగా నేను కూడానా వచ్చాను అంటూ ఉపాప‌స చెబుతుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ అందుకుని `తాను ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే చాలా ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే ఆ బిడ్డ మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది` అంటూ రాంచరణ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు. దీంతో చ‌ర‌ణ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. మ‌రోవైపు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు సినీ, రాజ‌కీక ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలుపుకున్నారు.

Share post:

Latest