పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!

తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంపై ఎప్పుడు ఏదో ఒక వార్త ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదట హీరోయిన్ త్రిషతో లవ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అది రూమర్ గా మిగలడంతో మళ్లీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఇవి కూడా వట్టి రూమర్ గాని మిగిలాయి.

Prabhas suffering from serious health issue?

ఇక తర్వాత అనుష్క, ప్రభాస్ నిజంగానే వివాహం చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ కోడై కోసింది . కేవలం మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ తెలియజేశారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయాలలో ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. ప్రభాస్ మాత్రం వరుస పెట్టి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రెమ్యూనరేషన్ పరంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు అందుకుంటూ ఉన్నారు ప్రభాస్.

ప్రభాస్ తాజాగా తన పెళ్లిపై స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ మాట్లాడుతూ ఇప్పుడు పెళ్లి గురించి నేను అంతగా ఆలోచించడం లేదు కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా అందరికీ చెప్పి చేసుకుంటానని.. ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించి అడుగుతుంటే తనకు చాలా చిరాకుగా అనిపిస్తోందని.. తెలియజేశారు తన పెళ్లి తానే స్వయంగా ప్రకటిస్తానంటూ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఏడాదైనా ప్రభాస్ అభిమానులకు శుభవార్త తెలుపుతారేమో చూడాలి మరి.

Share post:

Latest