చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసిన పూజా హెగ్డే.. ఇక కెరీర్ నాశ‌న‌మే!?

వరుస హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డే గ్రాఫ్ దెబ్బ‌కు పడిపోయింది. ఐరన్ లెగ్ అంటూ కూడా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అయితే గత ఏడాది ఎదురైనా ఫ్లాపుల కంటే గతంలో పూజా హెగ్డే చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు కెరీర్‌ డేంజర్ జోన్ లో పడిందని అంటున్నారు. మహర్షి సినిమాతో మొదలైన పూజా హెగ్డే మేనియా.. వరుసగా హిట్లు పడటంతో సౌత్ లో మోస్ట్ వాటెంటెడ్ బ్యూటీగా మారింది. దాంతో ఈ అమ్మ‌డు కాస్త తలపొగరుతో కేవ‌లం స్టార్ హీరోల సినిమాల‌కు మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

యంగ్ హీరో అంటే అస‌లు క‌థ కూడా విన‌కుండా నో చెప్పి చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసింది. ఆ ఎఫెక్ట్ పూజా మీద ఇప్పుడు బలంగా పడిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపులు.. స్టార్ హీరోల సినిమాల్లో నో ఆఫ‌ర్లు. పైగా ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా ప‌డింది. దీంతో పూజా హెగ్డే వైపు క‌నీసం కుర్ర హీరోలు కూడా క‌న్నెత్తి చూడ‌టం లేద‌ట‌. ఏదేమైనా హిట్లు ఉన్నప్పుడే యంగ్ హీరోలకు డేట్లు ఇచ్చుంటే ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆమె చేతిలో ఇప్పుడు పదుల కొద్దీ సినిమాలు ఉండేవి. కెరీర్ నాశ‌నం అయ్యేది కాద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Share post:

Latest