ఓటీటి లో దుమ్ము లేపడానికి సిద్ధమైన పఠాన్..!!

బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రం. ఏకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కు గురి చేస్తున్నది. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది బాహుబలి-2 చిత్రాన్ని వెనక్కి నెట్టి మరి హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

Pathaan movie review: SRK's comeback is high on action, low on logic |  Bollywood - Hindustan Times
తాజాగా పఠాన్ చిత్రం వెండితెర పైన పెను సంచలనాలు సృష్టించి డిజిటల్ స్క్రీన్ పైన కూడా రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓటీటి లో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటి హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ చివరిలో ఓటీతో లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. థియేటర్ల సినిమా ఇంకా రన్ అవుతూ ఉండడంతో ఓటిటి స్ట్రిమింగ్ విషయంలో పఠాన్ మూవీ చిత్ర బృందం కాస్త ఆలోచనలో పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుందేమో చూడాలి మరి. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

Share post:

Latest