మరొకసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ లపై గరికపాటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా మరో రెండు వారాలు గడిస్తే ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పలు రికార్డును కూడా క్రియేట్ చేసింది. RRR తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమోగేలా చేసింది.ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి పేర్లు వివిధ దేశాలలో సైతం మారుమోగుతున్నాయి. ఈనెల 13న 95 వ అకాడమీ అవార్డులను కూడా ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగువారితో పాటు భారతీయులంతా కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని చాలా దృఢంగా కోరుకుంటున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖ ప్రవచనాకర్త గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. నాటు నాటు పాట గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గరికపాటి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ముఖ్యంగా పురాణాలు వేదాలలో అంశాలనే కాక సమాజంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల గురించి కూడా ఆయన ప్రవచనాల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రవచనంలో భాగంగా.. నాటు నాటు పాట గురించి ప్రస్తావిస్తూ అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్ నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పాటలు ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని కీరవాణి సంగీతం రాజమౌళి దర్శకత్వం ప్రతిభ కారణంగా నేడు ఈ పాట ప్రపంచస్థాయి బహుమతి రాబోతోందని తెలిపారు.

అయితే ఇప్పుడు ఈ పాట ఎక్కడ చూసినా వినిపిస్తోందని దాంతో నేను ఈ పాటని చూశాను అరగంట పాటు అలాగే కూర్చుని ఈ పాటను విన్నాను ఈ పాట ఎందుకు అంత స్థాయికి వెళ్ళిందో అప్పుడు అర్థమయిందని తెలిపారు. ఈ పాటలో ఎక్కడా కూడా ఒక ఇంగ్లీష్ పదం కూడా లేదు. ఎంతో చక్కగా రాసిన చంద్రబోస్ కి నమస్కారం అంటూ తెలిపారు. రెండు వేరువేరు కుటుంబాలలో పుట్టిన మహానటులు ఇద్దరు ఇటువంటి అద్భుత నటనను ప్రదర్శించడంతో.. నాకంటే చిన్నవాళ్ళైనా సరే వీరికి నమస్కరిస్తున్నాను అంటూ తెలిపారు గరికపాటి.

Share post:

Latest