ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో సహా చిత్ర టీం గత మూడు వారాల నుంచి అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో 95వ ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి.

ఎప్పుడూ లేనంత ఉత్కంఠతో తెలుగు ప్రేక్షకులు ఈ వేడుక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ ఖాయమ ఇండియ‌న్ సినీ ప్రియులు ధీమాగా ఉన్నారు. ఇక‌పోతే `ఆర్ఆర్ఆర్‌` పై భారీ హైప్ పెంచ‌డం కోసం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ త‌ర‌చూ అమెరిక‌న్ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ధ‌రించిన‌ వాచ్ ఖ‌రీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పటెక్ ఫిలిప్ వాచ్ తో ఎన్టీఆర్ అమెరిక‌న్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అయితే ఈ వాచ్ గురించి అభిమానులు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన షాకైపోతున్నారు. ఎందుకంటే, ఈ వాచ్ ఖ‌రీదు ఏకంగా రూ. 2. 5 కోట్లు. దాంతో ఇక వాచ్ కోసం ఎన్టీఆర్ అంత ఖ‌ర్చు పెట్టాడా అంటూ చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం వంద కోట్ల హీరో వాచ్ ధర ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest