మూడ్ బాగోపోతే ఎన్టీఆర్ చూసే సినిమా ఏదో తెలుసా? అస్స‌లు ఊహించ‌లేరు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడొక గ్లోబ‌ల్ స్టార్‌. `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఆయ‌న క్రేజ్ ఖండాలు దాటేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు అభిమానులు ఏర్ప‌డ్డారు. ఇటీవ‌లె ఆస్కార్ వేడుక‌ను ముగించుకుని హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆయ‌న .. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ అయిన `ఎన్టీఆర్ 30`పై దృష్టి సారించారు. ఇక‌పోతే రీసెంట్ గా `దాస్ కా ధ‌మ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అయితే శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. ఎన్టీఆర్ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసి సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తన మూడ్ బాగోపోతే కొన్ని సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని.. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఒకటి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తన మ‌న‌సు బాగోలేకుంటే కచ్చితంగా చూస్తానని అన్నారు. ఈ చిత్రంలో విశ్వక్ కామెడీ చేయకుండానే నవ్విస్తాడని.. మనసులో బాధను దాచుకుని.. ఎంటర్టైన్ చేయడం కష్టమని ఆయ‌న అన్నారు. విశ్వక్ నటన చూసి కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest