ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించిన విశ్వ‌క్ సేన్‌.. ఏం జ‌రిగిందో తెలిస్తే షాకే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించాడు. అస‌లేం జ‌రిగిందంటే.. విశ్వ‌క్ సేన్ త్వ‌ర‌లోనే `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌ సేన్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై విశ్వక్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇండస్ట్రీలో పాపులర్ రైటర్‌గా పేరొందిన ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించిన చిత్రానికి విశ్వక్ సేన్ స్వ‌యంగా డైరెక్ట్ చేశాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. మార్చి 22న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా శుక్ర‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ విశ్వ‌క్ సేన్ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

‘దస్ కా ధ‌మ్కీ’ మూవీపి విశ్వ‌క్ తన ఇల్లు, ఆస్తులు అంతా అమ్మి మరీ తీశాడు. ఈ సినిమా ఆడకపోతే తాను రోడ్డున పడుతానని.. అందుకే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రావాలంటూ తనను కోరాడు. విశ్వ‌క్‌ ఆ మాట అన్నప్పుడు తనకు కన్నీళ్లు ఆగ‌లేద‌ని ఎన్టీఆర్ చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక సినిమా అంటే ఇంత పిచ్చి పనికిరాదని.. నువ్వు ఇక ఈ సినిమాతో దర్శకత్వం ఆపేసి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వు అంటూ వేదికపై విశ్వక్ కు ఎన్టీఆర్ సలహా ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest