ఆస్కార్ వ‌చ్చిన వేళ `ఆర్ఆర్ఆర్‌` టీమ్ సెల‌బ్రేష‌న్స్‌.. దూరంగా ఎన్టీఆర్!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఈ క్ర‌మంలోనే ఆస్కార్ వ‌చ్చిన వేళ `ఆర్ఆర్ఆర్‌` టీమ్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు. రాజమౌళి స్టే చేసిన హైస్ లో ఆస్కార్స్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎమ్ఎమ్ కీరవాణి తన గాత్రంతో అలరించార‌ట‌. అలాగే రామ్ చరణ్ డ్యాన్స్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అయితే ఈ సెల‌బ్రేష‌న్స్ కు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. అంతేకాదు, ఆస్కార్ వేడుక పూర్తైన వెంట‌నే ఆయ‌న ఇండియాకు వ‌చ్చేశారు. తన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడమే ఇందుకు కారణం గా చెప్తున్నారు. కుటుంబం మొత్తం విషాదంలో ఉన్నప్పుడు ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకోవడం ఎన్టీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఈ ఈవెంట్ కి హాజరు కాకూడదని అనుకున్నాడట. కానీ, రాజ‌మౌళి బ‌ల‌వంతం చేయ‌డంతో అమెరికా వెళ్లార‌ట‌. ఆస్కార్ ఈవెంట్ కంప్లీట్ అవ్వ‌గానే రాజ‌మౌళి ఇచ్చిన పార్టీలో పాల్గొన‌కుండా ఫ్లైట్ ఎక్కేశార‌ని అంటున్నారు.

Share post:

Latest