అవన్నీ పుకార్లే.. మంచు మ‌నోజ్ పెళ్లితో అస‌లు నిజం తేలిపోయిందిగా!

మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ ఫైనల్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. భూమా మౌనికారెడ్డితో ఏడడుగులు వేశాడు. శుక్ర‌వారం రాత్రి మంచు లక్ష్మి నివాసంలో మంచు మ‌నోజ్‌-మౌనిక వివాహం వైభ‌వంగా జ‌రిగింది. గత కొంత కాలం నుంచి ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే.

 

మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక‌పోతే మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య చెడిందని గ‌త‌ కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తండ్రితో గొడవల కారణంగా మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. అలాగే మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవ‌డం మోహన్ బాబుకు ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లికి ఆయ‌న దూరంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ పుకార్లే అని స్ప‌ష్ట‌మైంది. మంచు మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. తనయుడి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. దీంతో మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని తేలిపోయింది.

Share post:

Latest