నయనతార కు పెళ్లి కలిసి రాలేదా..!!

సౌత్ లేడీస్ సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఈమె సౌత్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది దర్శకుడు విగ్నేష్ కు నయనతార కు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నయన్ కు పెళ్లికి ముందు భారీ ఆఫర్లు చేతినిండా ఉండేవి పెళ్లి చేసుకున్న అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Nayanthara and Vignesh Shivan's wedding leaves this star actor heartbroken!  | Bengali Movie News - Times of India
హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్ గా మారిన నయనతర ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి. ఇటీవలే బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసింది. నయన్ హిందీలో షారుక్ ఖాన్ కి జంటగా నటించిన జవాన్ చిత్రం తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవల్ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకున్నాయి. ఇక వీటి విడుదల కోసం వెయిట్ చేస్తోంది. ఆ తరువాత ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది. దీనికి కారణం ఆమె చేతిలో కొత్త చిత్రాలు లేకపోవటమే

ఎందుకంటే నయనతార పారతోషకం విషయంలో ఎక్కువ డిమాండ్ చేయటం వల్ల చిత్రాలు సైతం వెనక్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాత సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్ కథ చిత్రాలు చేయటానికి అంగీకరించారని అందుకు ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల చొప్పున రెండు చిత్రాలకు రూ .20 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. అయితే అడ్వాన్స్ తీసుకొని రెండేళ్లు చిత్రాలను చేయకపోవటంతో ఆ చిత్రాలను నిలిపివేయటమే కాకుండా డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే తన భర్త పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. ఆయన దర్శకత్వం వహించవలసిన అజిత్ చిత్రం కూడా చేయి జారిపోయినట్లు సమాచారం. దీంతో నయనతారకు టైం బాగాలేదా? అంటూ కొందరు నేటిజనులు కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest