హనీమూన్ కి అక్కడికి వెళ్ళనున్న నరేష్- పవిత్ర..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ కూడా వివాదాస్పదంగా మారుతున్న జంటలలో నరేష్ ,పవిత్ర లోకేష్ పెళ్లి వార్త ఒకటి అని చెప్పవచ్చు. తాజాగా వీరిద్దరి వివాహం చేసుకొని ఏడు అడుగుల బంధంతో ఒకటైన ఈ జంట ఇప్పుడు హనీమూన్ కు కూడా వీరిద్దరు విహరిస్తున్న వీడియోలు కొన్ని వైరల్ గా మారుతున్నాయి. నరేష్ ,పవిత్ర వివాహం చేసుకున్నట్టుగా ట్విట్టర్ ద్వారా రివిల్ చేశారు. మా కొత్త ప్రయాణంలో జీవితకాలం పాటు శాంతి ఆనందం కోసం మీ దీవెనలు కావాలంటూ అభిమానులను కోరుతూ ఒక పోస్టుని చేయడం జరిగింది.

నరేష్ కు ఇది నాలుగవ వివాహం కాగా నటి పవిత్ర లోకేష్ కు ఇది రెండవ వివాహం. సినిమా షూటింగ్స్ సమయాలలో ప్రేమలో పడ్డ ఈ జంట నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య ఉన్న బంధాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంలో వీధి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక తమకు విడాకులు ఇవ్వకుండానే మరొక పెళ్లి ఎలా చేసుకుంటారని రమ్య వాగ్దానానికి దిగి కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది.

Naresh Pavitra Lokesh Marriage Video | #pavitranaresh | TFPC - YouTube

ఇక ఏడాది మొదట్లో న్యూ ఇయర్ సందర్భంగా ఒక సెన్సేషనల్ వీడియోని నరేష్ విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వీడియోని పోస్ట్ చేసి మరొకసారి షాక్ ఇచ్చారు ఇది సినిమా ప్రమోషనా లేకపోతే నిజంగా వీరి పెళ్లి చేసుకున్నారా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రేక్షకులు.ప్రస్తుతం వీరిద్దరూ దుబాయిలో దర్శనమిచ్చారు. దీంతో హనీమూన్ కు వెళ్లారన్న వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest