ప‌విత్ర‌తో పెళ్లి చెల్ల‌దా.. న‌రేష్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మేనా..?

ప్రముఖ న‌టుడు వీకే నరేష్ తాజాగా న‌టి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. ఇప్ప‌టికే వీరి పెళ్లి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే మ‌రోవైపు వీరి పెళ్లి చెల్ల‌దంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

న‌రేష్ కు ఇది నాల్గువ వివాహం కాగా.. ప‌విత్ర‌కు రెండొవ‌ది. నరేష్‌ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. అయితే రమ్య రఘుపతి మాత్రం నరేష్ కి విడాకులు ఇవ్వనని, కొడుకు కోసం భర్తను కోరుకుంటున్నాన‌ని చెబుతోంది. త‌న‌కు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరం, అది చెల్లద‌ని అంటోంది. నరేష్ తో రాజీ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించగా, నరేష్ మాత్రం విడాకుల పిటిషన్ వేశాడు.

ఈ రెండు కేసుల్లో నరేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో న‌రేష్ ప‌విత్ర‌ను పెళ్లి చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దీంతో వీరిది పెళ్లి చెల్ల‌దంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఐపీసీ 494 ప్రకారం భార్య బ్రతికుండగా విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. అది నేరం. ఒక‌వేళ నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే న‌రేష్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, నరేష్ కి ఇవన్నీ తెలియనవి కావు అనేవాళ్లు ఉన్నారు.

Share post:

Latest