మృణాల్ కు డ‌బ్బు పిచ్చిగాని ప‌ట్టిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదే అదును అనుకున్న మృణాల్‌.. త‌న రమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింద‌ట‌. ఒక్క సినిమాకు ఏకంగా రూ. 5 కోట్ల రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేస్తుంద‌ట‌. అందుకు ఒక్క రూపాయి త‌గ్గినా సినిమా చేయ‌న‌ని చెతుంద‌ట‌.

దాంతో దర్శకనిర్మాతలు కొంగు తింటున్నారని.. అంత మొత్తం ఇచ్చుకోలేక వెనక్కి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇక రెమ్యున‌రేషన్ కార‌ణంగానే మృణాల్ ఇటీవ‌ల ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల‌ను కూడా వ‌దులుకుంద‌ని టాక్‌. ఈ విషయం తెలిసి సినీ ప్రియులు మృణాల్ ను ఏకేస్తున్నారు. నీకు డ‌బ్బు పిచ్చిగాని పట్టిందా.. స్టార్ హీరోల ప్రాజెక్ట్ లు కాద‌ని అంత తింగరి పని ఎలా చేశావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇలా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తే వచ్చే ఆఫర్లు కూడా రావని మృణాల్ కు చుర‌క‌లు వేస్తున్నారు.

Share post:

Latest