మీటర్ టీజర్: మళ్లీ కామెడీనే నమ్ముకున్న కిరణ్ అబ్బవరం..!!

వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ మీద దూసుకుపోతున్నారు హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే పనిలో ఉన్నారు ఈ హీరో. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో మంచి హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు తాజాగా మరొక కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ నెలలో మరొకసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఆ సినిమానే మీటర్.

రమేష్ కాడూరి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మీటర్ సినిమాల కిరణ్ అబ్బవరం పోలీస్ అధికారిక కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం ఎస్సై పాత్రలో నటిస్తూ ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అసిస్టెంట్ గా సప్తగిరి కూడా కనిపిస్తున్నారు. కీలకమైన పాత్రలో నటుడు పోసాని కూడా ఇందులో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు టెంపర్ సినిమాని గుర్తు చేసేలా కనిపిస్తున్నాయి.

పోసాని ,కిరణ్ అబ్బవరం మధ్య జరిగే సన్నివేశాలు కామెడీ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తూ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగులు కూడా ఈ టీజర్లు బాగానే పేలుతున్నాయి. టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మైత్రి మూవీ మేకర్స్ వారు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest