ఏంటీ.. మంచు విష్ణు త‌న తండ్రి కంటే ఆ అమ్మాయికే ఎక్కువ భ‌య‌ప‌డ‌తాడా?

మంచు విష్ణు గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. త‌న సినీ కెరీర్ లో పాతిక‌కు పైగా చిత్రాల్లో న‌టించాడు. న‌టుడిగా మంచి మార్పులు వేయించుకున్నాడు. కానీ, వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా స్టార్ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు.

అయితే హీరోగా స‌క్సెస్ కాక‌పోయినా.. వ్యాపార‌వేత్త‌గా బాగానే రాణిస్తున్నాడు. అలాగే శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల‌కు సీఈఓగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పోతే నేడు మంచు విష్ణు పెళ్లి రోజు. స‌రిగ్గా 14 క్రితం విరానిక రెడ్డితో మంచు విష్ణు ఏడ‌డుగులు వేశాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ దంప‌తుల‌కు న‌లుగురు సంతానం. చిన్న‌త‌నం నుంచి అమెరికాలోనే పెరిగిన‌ విరానిక స‌క్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా స‌త్తా చాటుతోంది.

అయితే నేడు త‌మ 14వ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా మంచు విష్ణు ఓ ట్వీట్ చేశారు. విరానిక‌తో దిగిన ఫోటోను పంచుకున్న విష్ణు.. `మా నాన్న కంటే కూడా ఎక్కువ భ‌య‌ప‌డేది విరానిక‌కే. అయినా నిన్ను ఎంత‌గానో ప్రేమిస్తున్నాను.. హ్యాపీ యానివ‌ర్స‌రీ` అంటూ రాసుకొచ్చింది. దీంతో విష్ణు పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది. కాగా, మామూలుగానే మోహన్ బాబు గారిని చూస్తే అందరూ భయపడతారని, దానికి తోడు ఆయనది మామూలు క్రమ శిక్షణ కాదు.. అతి క్రమశిక్షణ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు మంచు విష్ణు త‌న తండ్రి కంటే భార్య‌కే ఎక్కువ‌గా భ‌య‌ప‌డ‌తాన‌ని కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest