మరో తారకరత్నగా మారనున్న మంచు మనోజ్..!

నందమూరి తారకరత్న వ్యక్తిత్వం విషయంలో చాలా గొప్పవాడు.. అయితే తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు దాదాపు పది సంవత్సరాలు పాటు తారకరత్నను దూరం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భార్యతోనే జీవితం గడిపిన ఈయన కెరియర్ లో సక్సెస్ పొందలేక అటు కుటుంబానికి దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. ఇటీవలే గుండెపోటుతో మరణించారు.

Pics: Taraka Ratna Family Photos - Father, wife, Children,

ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో బడా ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కూడా ఇటీవల తన కుటుంబానికి ఇష్టం లేని వివాహాన్ని చేసుకున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఇప్పటికే అటు మనోజ్ ఇటు మౌనిక ఇద్దరికీ కూడా ఇదివరకే వివాహం అయ్యింది. కానీ మొదటి వివాహంతో బ్రేకప్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఇలా ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో నందమూరి తారకరత్న లాగే మంచు మనోజ్ కూడా కుటుంబానికి దూరం కానున్నాడా అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu | YS  Vijayamma | Manastars - YouTube

అయితే మంచు మనోజ్ కు తల్లిదండ్రుల సపోర్టు ఉన్నా లేకపోయినా ఆయనకు తన అక్క లక్ష్మీ సపోర్ట్ మాత్రం ఎల్లవేళలా ఉంటుంది . అలాగే మరొకవైపు భార్య మౌనిక రెడ్డి కూడా రాజకీయాలలో చాలా పాపులారిటీ దక్కించుకున్నారు . కాబట్టి మంచు మనోజ్ కు భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది.. ఏది ఏమైనా తారకరత్నలాగా ఈయన ఇబ్బంది పడకుండా చక్కగా భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Share post:

Latest