కాబోయే భార్య ఫోటో షేర్ చేసిన మంచు మ‌నోజ్.. ఫైన‌ల్‌గా పెళ్లిపై క్లారిటీ!

గ‌త కొద్ది రోజుల నుంచి మంచు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని.. దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి.

అయితే అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం వ‌ల్ల కాస్త గంద‌ల‌గోళం నెల‌కొన్నా.. ఫైన‌ల్ గా ఆ వార్త‌లే నిజం అయ్యాయి. తాజాగా మంచు మ‌నోజ్ త‌న‌కు కాబోయే భార్య ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. భూమా మౌనికారెడ్డి అంద‌మైన‌ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. పెళ్లికూతురు అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు.

మ‌నోజ్ వెడ్స్ మౌనిక‌ అంటూ హాష్‌ట్యాగ్‌జోడించారు. దీంతో నెటిజ‌న్లు మ‌నోజ్‌, మౌనిక‌ల‌కు విషెస్ తెలుపుతున్నారు. కాగా, మ‌రి కొన్ని గంట‌ల్లోనే మ‌నోజ్‌, మౌనిక పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక పెళ్లి వేడుక జరగనుంద‌ని అంటున్నారు.

Share post:

Latest