ఘనంగా మంచు మనోజ్ -మౌనిక పెళ్లి.. ఫొటోస్ వైరల్..!!

గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల రెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మంచు మనొజ్ ఈ విషయం పైన స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున స్పందించడంతో కచ్చితంగా మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారని విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.నిన్నటి రోజున సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అది కూడా మంచు లక్ష్మి నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది.

గతంలో మంచు మోహన్ బాబు కూడా మొత్తం ఫిలిం నగర్ లోని నివాసం ఉండేవారు.కానీ మోహన్ బాబు కుటుంబం శంషాబాద్ వైపు కట్టుకున్న కొత్త నివాసానికి వెళ్ళడంతో ఫిలింనగర్ నివాసంలో కేవలం మంచు లక్ష్మీ ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లోనే మంచు మనోజ్ వివాహం చాలా ఘనంగా చేసుకున్నారు.

ఇప్పటికే మనోజ్ కి సన్నిహితులు, తెలుగు పరిశ్రమలో ఉన్న స్నేహితులు సైతం ఈ వివాహానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరికి సంబంధించి కొన్ని వివాహ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఈ వేడుకలలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయమ్మ, భూమా అఖిలప్రియ దంపతులు ఇరువురు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఈ నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి దీంతో మంచు మనోజ్ అభిమానులు మంచు మనోజ్ కు మౌనిక రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

Share post:

Latest