మరో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఆడియన్స్ కి పండగే!

మంచు ఫ్యామిలీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక పోయింది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది.

అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం జిన్నా సినిమా విపరీతంగా ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొంది. గతంలో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం మంచు హీరో లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన మంచు లక్ష్మి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాతో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘తెలుసా తెలుసా.. ‘అనే పాటను విడుదల చేస్తున్నట్లు మంచు లక్ష్మి అధికారికంగా ప్రకటించింది.

వంశీకృష్ణ మల్లా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మంచు లక్ష్మి పేర్కొన్నారు. సినిమాకి సంబంధించి ప్రస్తుతం పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మాత్రం చెప్పలేం. ఈ మూవీలో మంచు లక్ష్మి ఒక బోల్డ్ క్యారెక్టర్ పాటించనుందని తెలుస్తోంది. అయితే ఆమె రోల్ సినిమా విడుదల అయ్యాక బాగుంటే పర్వాలేదు కానీ నెగటివ్ టాక్ వస్తే మాత్రం జనాల రియాక్షన్ ముఖ్యంగా సోషల్ మీడియా జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోహన్ బాబు, విష్ణులకు ఎదురైన సోషల్ మీడియా ట్రోల్స్ మంచు లక్ష్మి కూడా ఎదుర్కోవాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే మంచు లక్ష్మి ఈ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె సన్నిహితులు అంటున్నారు. కానీ సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పాలేం.

Share post:

Latest