క‌న్న తండ్రే కామాందుడిలా వేధించాడు.. కుష్బూ క‌ష్టాలు వింటే క‌న్నీలాగ‌వు!

ప్రముఖ నటి కుష్బూ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కుష్బూ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. సౌత్ లో అగ్ర న‌టిగా చక్రం తిప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన దూకుడు చూపిస్తోంది. బీజేపీ పార్టీ కొనసాగుతున్న కుష్బూ సుందర్ రీసెంట్ గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ గా నియమించింది.

ఈ సందర్భంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె సమాజం లో ఆడవాళ్లపై అత్యాచారాల గురించి మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని సంచ‌ల‌న నిజాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అది కూడా బ‌య‌ట వ్య‌క్తులు కాదు.. క‌న్న తండ్రే కామాందుడిలా మారి కుష్బూను వేధించాడ‌ట‌. నిజంగా ఈమె క‌ష్టాలు వింటే క‌న్నీలావ‌వు. అస‌లు కుష్బూ ఏం చెప్పారంటే..

`నేను చిన్నతనం నుండే లైంగిక వేధింపులకు గురి అయ్యాను. నా కన్న తండ్రే లైంగికంగా వేధించేవాడు. రోజు మా అమ్మ‌ను కొట్టేవాడు. 8 ఏళ్ల వయస్సు నుంచే నాపై అతడి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. నాకు 15 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అతని పై తిరగ‌బ‌డ్డాను. నాకు 16 ఏళ్లు కూడా రాకముందే అతడు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పుడు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే రేపటి భోజనం ఎక్కడ నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. అప్పుడే ధైర్యం కూడగట్టుకుని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను.` అంటూ కుష్బూ చెప్పుకొచ్చారు. దీంతో ఈమె వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాడు.

Share post:

Latest