చ‌ర‌ణ్ అలాంటి వాడే.. ఆ అనుభ‌వాన్ని మ‌ర‌చిపోలేను.. కియారా షాకింగ్ కామెంట్స్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంట‌గా ప్ర‌స్తుతం `ఆర్సీ 15` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ యాభై శాతం కంప్లీట్ అయింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. రామ్ చ‌ర‌ణ్ తో షూటింగ్ అనుభవాలను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ ఎలాంటి వాడు, అత‌డి వ్యక్తిత‌త్వం గురించి కూడా మాట్లాడింది. గతంలో రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ మూవీ చేసిన కియారా.. ఆయనతో కలిసి వ‌ర్క్‌ చేయడం ఎప్పుడూ లవ్ లీ గానే ఉంటుందని చెప్పింది.

చెర్రీ మంచి యాక్టర్ మాత్రమే కాదు గొప్ప డాన్సర్ కూడా అంటూ కొనియాడింది. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ రామ్ చరణ్ లో మార్పు లేదని, ఎలాంటి గ‌ర్వం క‌నిపించ‌దు.. ఇత‌రుల‌తో ఎంతో వినయగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే చ‌ర‌ణ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ను ఎప్పటికీ మ‌ర‌చిపోలేను అంటూ కియారా పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest