ఆ కమ్మ స్థానాల్లో కాన్ఫిడెన్స్ రావట్లేదా?  

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రెండు జిల్లాల్లో కమ్మ నేతలు బరిలో దిగే స్థానాల్లో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాదాపు అన్నీ స్థానాలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..అదే సమయంలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడుతుంది గాని..కొన్ని చోట్ల టి‌డి‌పి బలం పెరిగిందో లేదో చెప్పలేని పరిస్తితి.

ఉదాహరణకు గుడివాడ స్థానం ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి కొడాలి నాని, టి‌డి‌పి నుంచి రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఇక్కడ కొడాలి హవానే ఎక్కువ ఉంది. టి‌డి‌పి ఇంకా బలపడాలి. అటు పక్కనే ఉన్న గన్నవరంలో కూడా కమ్మ వర్గం హవా ఉంది. అక్కడ వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది. ఇటు పక్కనే ఉన్న పెనమలూరులో మాత్రం కాస్త టి‌డి‌పికి పట్టు దొరికినట్లు కనిపిస్తుంది. విజయవాడ సిటీలో కూడా టి‌డి‌పికి లీడ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇక మైలవరంలో టి‌డి‌పి-వైసీపీల మధ్య పోటాపోటి ఉంది.

ఇక గుంటూరు విషయానికొస్తే..చిలకలూరిపేట, పొన్నూరు, వినుకొండల్లో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువే..ఈ మూడు స్థానాల్లో టి‌డి‌పికి పట్టు కనిపిస్తుంది. ఇంకా కమ్మ వర్గం ప్రభావం ఎక్కువ ఉన్న గురజాలలో పోటాపోటి వాతావరణం ఉంది. పెదకూరపాడు పరిస్తితి కూడా అంతే. అటు సత్తెనపల్లిలో కూడా క్లారిటీ రావడం లేదు. తెనాలిలో సైతం టఫ్ ఫైట్ ఉంది.

కాకపోతే టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి తెనాలిలో ఛాన్స్ లేదు. గుంటూరు వెస్ట్ లో కూడా అదే పరిస్తితి. అంటే కమ్మ వర్గం ప్రభావం కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి లీడ్ కనిపిస్తుంటే కొన్ని చోట్ల పోటాపోటి వాతావరణం ఉంది.

Share post:

Latest