మంత్రులపై జగన్ సీరియస్..వారిపై వేటు తప్పదా?

మరొకసారి సి‌ఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ అనంతరం జగన్..కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు తప్పకుండా గెలవాలని వారికి టార్గెట్ ఇచ్చారని సమాచారం..అందులో విఫలమైతే మంత్రులపై వేటు వడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రలంతా అలెర్ట్ అయ్యారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది వరకు సమయం ఉంది. ఇప్పుడు వేటుపడితే కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కొందరు మంత్రుల పనితీరు పట్ల జగన్ సంతృప్తిగా లేరని తెలుస్తోంది..వారిలో దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ  ఉన్నారని సమాచారం. అయితే ఎవరిపై వేటు పడుతుందో క్లారిటీ లేదు గాని..వేటు పడితే ఖచ్చితంగా ఇద్దరు, ముగ్గురుపైన పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో కొత్తవారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు లాంటి వారిని మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం వస్తుంది. చూడాలి జగన్ అసలు మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో.

Share post:

Latest