అల్లు అరవింద్ యాక్టర్ కాలేకపోవడానికి కారణం అదేనా..?

దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. నిర్మాతగా ఆయనకున్న అనుభవం చెప్పలేనిది అని చెప్పవచ్చు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఎప్పుడు కూడా నటుడుగా ఎందుకు ఎక్కువగా నటించలేదు.. రామలింగయ్య అంతటి గొప్ప నటులు ఆయన వారసత్వం నుంచి రావాల్సిన నటులు కానీ హీరోలుగా ఎందుకు మారలేదు..అనే విషయం అందరిలోనూ కలిగే అనుమానం.

ఇక అప్పట్లో అల్లు అరవింద్ తండ్రి కూడా తనని నటుడు అవ్వమని అడిగేవారట.. నటుడు అయితే వన్ వే లోనే డబ్బులు వస్తాయి..నిర్మాత అయితే డబ్బులు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి ఇది రిస్క్ జాబు కూడా కానీ అరవింద్ అల్లు రామలింగయ్య మాట అసలు వినలేదట. వీటన్నిటికీ అల్లు అరవింద్ సమాధానం ఒకటే చెప్పేవారట.. నేను సుప్రీం కమాండర్ గా ఉండాలని నిర్ణయించుకున్నారట. కేవలం అల్లు అరవింద్ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అందులో కొంతమంది నటులకు సాంకేతిక నిపుణులకు పని కనిపించాలని ఉద్దేశంతోనే ఈ వైపుగా వచ్చానని తెలియజేసినట్టు సమాచారం. అందుచేతనే గీత ఆర్ట్స్ సంస్థ కూడా స్థాపించారని తెలియజేశారు.

ఇదివరకు ఇదే సంస్థలో ఎన్నో సినిమాలను నిర్మించారు. కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ కూడా అయింది. ఇప్పుడు ఇదే సంస్థకు అనుబంధంగా GA -2 అనే బ్యానర్ ని కూడా నిర్మించి ఎన్నో చిత్రాలను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ కలిగిన చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే తనకి నటన మీద ఎక్కువ ఇష్టం లేదని అల్లు అరవింద్ తెలియజేసినట్లు సమాచారం.

Share post:

Latest