గుడివాడ-గన్నవరం టీడీపీకి దక్కడం కష్టమే!

తెలుగుదేశం పార్టీకి మరొకసారి గుడివాడ దక్కేలా లేదు..కొడాలి నానికి టి‌డి‌పి చెక్ పెట్టడం కష్టమని తేలిపోతుంది…గుడివాడతో పాటు గన్నవరంలో కూడా టి‌డి‌పి ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇక్కడ వల్లభనేని వంశీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని తాజా సర్వేల్లో తేలింది. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ..సర్వే విడుదల చేసిన విషయం తెలిసిందే..ఈ సర్వేలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలని చూస్తే..ఊహించని ఫలితాలు వచ్చాయి.

గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ..వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో సీన్ మారింది. గన్నవరంలో టి‌డి‌పికి సరైన అభ్యర్ధి లేరు..దీంతో అక్కడ వంశీ హవా నడుస్తుందని తెలిసింది. తాజా సర్వేలో కూడా గుడివాడ-గన్నవరంల్లో వైసీపీ గెలుస్తుందని తేలింది. అంటే గుడివాడలో కొడాలి, గన్నవరంలో వంశీ గెలవడం ఖాయమని చెప్పవచ్చు. వాటితో పాటు పామర్రు, నూజివీడు, తిరువూరు సీట్లలో కూడా వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పారు.

అయితే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం సీట్లలో టి‌డి‌పి గెలుస్తుందని సర్వే తేల్చి చెప్పింది. అంటే జిల్లాలో టి‌డి‌పికే ఆధిక్యం వస్తుందని సర్వేలో తేలింది. అలాగే విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ సీట్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

ఇక టి‌డి‌పితో జనసేన పొత్తు ఉంటే విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లలో వైసీపీ గెలవడం సాధ్యమయ్యే పని కాదని చెప్పవచ్చు. మొత్తానికి కృష్ణాలో టి‌డి‌పి ఆధిక్యం ఉంది.

Share post:

Latest