టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

RRR చిత్రంతో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యారు. హాలీవుడ్ మీడియా సైతం ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పైన ప్రత్యేకమైన ఫోకస్ చేయడం విశేషమని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో అత్యంత ప్రభావితమైన హీరో ఎవరనే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలియజేసింది.

NTR Trends (@NTRFanTrends) / Twitter

మార్చి ఒకటి నుంచి 12 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువ ఆదరణ ఉన్న సెలబ్రిటీ స్టార్ గా ఎన్టీఆర్ నిలవడం విశేషమని చెప్పవచ్చు జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే రామ్ చరణ్ రెండవ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, పవన్ కళ్యాణ్ ఉండడం విశేషం. సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోగా తారక్ మొదటి స్థానంలో నిలవడంతో అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండీ గా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్స్ లో మొదటి రెండు స్థానాలలో వీరిద్దరూ ఉన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది ఇప్పుడు నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా రావడంతో మరింత పాపులర్ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే ఎన్టీఆర్ ఈ ఆస్కార్ సెలబ్రేషన్స్ ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమాను షూటింగ్ చేయబోతున్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు.

Share post:

Latest