మైలవరంపై వసంత పట్టు..దేవినేనికి మళ్ళీ రిస్క్!

మొన్నటివరకు మైలవరం వైసీపీ సీటు విషయంలో స్పష్టత రాలేదు..ఓ వైపు జోగి రమేష్, మరోవైపు వసంత కృష్ణప్రసాద్..ఇరువురి వర్గాల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. అయితే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం కావడంతో..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకే తన గ్రూపుని యాక్టివ్ చేశారు. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా జోగి వర్గం పావులు కదుపుతుంది.

ఇదే క్రమంలో వసంత జగన్ దగ్గరకు వెళ్ళడం..జగన్ ఏమో జోగికి క్లాస్ పీకి ఎవరిని నియోజకవర్గంలో వారే ఉండాలని చెప్పడం..తనతో కలిసి ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలని వసంతకు జగన్ సూచించడం..మళ్ళీ గడపగడపకు తిరగాలని చెప్పడంతో..వసంత మైలవరంలో మళ్ళీ గడపగడపకు తిరుగుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదట్లో ఆయనపై వ్యతిరేకత కనిపించింది. కానీ ఇటీవల జోగి వర్గం కార్యక్రమాల వల్ల వసంతపై కాస్త సానుభూతి పెరిగినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో రాజధాని విషయంలో వసంత కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా తాను రాజధానిగా అమరావతికే మద్ధతు ఇస్తానని, కానీ ప్రభుత్వ పరంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నానని అన్నారు. అంటే దీని వల్ల మైలవరంలో తనపై వ్యతిరేకత రాకూడదని వసంత చూస్తున్నారు.

ఇలాంటి పరిస్తితుల్లో టి‌డి‌పి నేత దేవినేని ఉమాకు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి కష్టపడలా? అనే పరిస్తితి. పైగా టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని..వైసీపీ ఎమ్మెల్యే వసంతకు మద్దతు ఇస్తున్నారు. ఇటు దేవినేనికి వ్యతిరేకంగా టి‌డి‌పి నేత బొమ్మసాని సుబ్బారావు పనిచేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ దేవినేనికి మైలవరంలో రిస్క్ పెరుగుతుందా అనే పరిస్తితి.

Share post:

Latest