దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!

టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టి‌డి‌పి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ సవాల్ చేశారు.

అంటే ఆ రెండు పార్టీలని రెచ్చగొట్టి ఒంటరిగా పోటీ చేసేలా చేస్తే తమకే మేలు జరుగుతుందనేది వైసీపీ లక్ష్యం. అందుకే అలా రెచ్చగొడుతుంది. అయితే వైసీపీ ట్రాప్ లో టి‌డి‌పి-జనసేన పడేలా లేవు..రెండు పార్టీలు పొత్తు దిశగానే ముందుకెళ్లెలా ఉన్నాయి. ఇదే క్రమంలో కొన్ని సీట్లు టి‌డి‌పి..జనసేన కోసం వదిలేయాలి. ఇప్పటికే కొన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.  ఈ ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి సీటు సైతం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.

అయితే దర్శిలో టి‌డి‌పికి పట్టు ఎక్కువ..గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం దర్శి మున్సిపాలిటీని టి‌డి‌పి కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్..ఇంచార్జ్ పదవికి రాజీనామా చేయడం పెద్ద ట్విస్ట్ గా మారింది. అదే సమయంలో ఆయనతో జనసేన నేతలు సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం వచ్చింది.

కానీ ఆయన జనసేనలోకి వెళ్ళడం లేదని, టి‌డి‌పిలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే తనతో జనసేన నేతలు సంప్రదింపులు జరిపింది..పొత్తులో భాగంగా దర్శి సీటు జనసేనకు దక్కుతుందనే చెప్పి..దర్శి లో పరిస్తితి అడిగి తెలుసుకోవడానికి జనసేన నేతలు తనని కలిశారని రమేష్ అంటున్నారు. దీని బట్టి చూస్తే దర్శి సీటు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest